Home తెలంగాణ శ్రీదేవి బదిలీపై అంతర్యమేంటి? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

శ్రీదేవి బదిలీపై అంతర్యమేంటి? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
శ్రీదేవి బదిలీపై అంతర్యమేంటి? - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • బాధ్యతలు చేపట్టిన 9 నెలలకే కమర్షియల్ టాక్స్ కమిషనర్‌కు షాకిచ్చిన సర్కారు
  • మొదటినుంచీ ఆరోపణలు
  • జీఎస్టీ స్కామ్‌లోనూ అధికారి అత్యుత్సాహం
  • బదిలీని ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు!

ముద్ర, తెలంగాణ బ్యూరో : తాజాగా జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో కమర్షియల్ టాక్స్ కమిషనర్ శ్రీదేవికి రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఈ శాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. శ్రీదేవి బదిలీకి కూడా చాలా కారణాలు ఉన్నాయనేది ఆ శాఖలో ప్రచారం. డిసెంబర్‌లో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.. ఆమెపై ఆరోపణలు మొదలయ్యాయి. శనివారం శ్రీదేవి ట్రాన్స్‌ఫర్ కమిషనర్ ఆఫీసు ముందు కొందరు ఉద్యోగులు బాణాసంచా కాల్చారు. ఈ ఆమె బదిలీ అయిన సంతోషంతో వారు బాణాసంచా కాల్చినట్లు సమాచారం. ఉద్యోగులు, సిబ్బంది ఏకంగా బాణాసంచా కాల్చారంటే ఆమెపై వ్యతిరేకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

అత్యుత్సాహంపై ప్రభుత్వం గుర్రు..?

ఇటీవల రాష్ట్రంలో సంచలనంగా మారిన రూ.1,400కోట్ల జీఎస్టీ స్కామ్ విషయంలోనూ శ్రీదేవి అత్యుత్సాహం చూపించినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీదేవిపై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆమె పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ కోరికనే సీఎం మొప్పు పొందేందుకు జీఎస్టీ శాఖలో అవకతవకలపై అంతర్గతంగా విచారణ జరిపి రూ.1,400కోట్ల స్కామ్ జరిగినట్లు ఆమె తేల్చారు. ఇటీవల జీఎస్టీ స్కామ్‌పై జైంట్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఇంతవరకు బాగానే ఉంది. అయితే మాజీ ఎస్సై నిందితుడిగా ఉన్న ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసేముందు సీఎం రేవంత్ రెడ్డికి గానీ, సీఎస్‌కు కూడా కమిషనర్ శ్రీదేవి చెప్పలేదనే ప్రచారం జరిగింది. ఆమె చూపిన అత్యుత్సాహంపై ప్రభుత్వం గుర్రుగా చూపుతోంది. జీఎస్టీ కమిషనర్‌గా వెంటనే శ్రీదేవి బాధ్యతలు స్వీకరించిన రూ.2 కోట్లతో తన ఛాంబర్ మరమ్మతులకు శ్రీకారం చుట్టారనే ప్రచారం జరిగింది. అయితే ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ ఛాంబర్ మరమ్మతులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రూ.2 కోట్ల మొత్తం మంజూరైనా బిల్లు మరమ్మతు పనులు ఇంకా పూర్తి కాలేదని ఆరోపణలు ఉన్నాయి. ఆట్రా మరమ్మతులకు అయ్యే బిల్లు మాత్రం కాంట్రాక్టర్‌కు మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది.

అవసరం లేకున్నా ఎక్కువ ధరకు 200 ల్యాప్టాప్ల కొనుగోలు

డిపార్ట్‌మెంట్ అవసరాల నిమిత్తం ఇటీవల 200 ల్యాప్ టాప్‌లను కొనుగోలు చేశారు. వాస్తవానికి అన్ని ఈ ల్యాప్ట్యాప్లు అవసరం లేకున్నా.. 200 కావాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. అంతేకాదు.. తన పలుకుబడితో ప్రతిపాదనలు పంపిన రెండు రోజుల్లోనే వాటికి అవసరమయ్యే నిధులను విడుదల చేయించుకున్నట్లు సమాచారం. అయితే ఒక్కో లాప్ట్యాప్ ధర రూ.70,000 అయితే.. వాటిని రూ.95వేలకు కొన్నట్లు ఆమె లెక్కల్లో చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ ఆఫీసులో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకొని, వారికే అధిక ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్గొండకు చెందిన ఓ అధికారి హైదరాబాద్ కమిషనర్ ఆఫీసులో డిప్యుటేషన్‌పై పని చూపుతున్నారు. అయితే ఎలాంటి ఆదేశాలు లేకుండా, ఆ అధికారి శీదేవి అండదండలతోనే ఇక్కడ పని చేయడానికి సమచారం. నిజామాబాద్‌కు చెందిన మరో అధికారి కూడా అనధికారికంగా శ్రీదేవి ప్రోత్సాహంతో హైదరాబాద్ ఆఫీసులో విధులు ప్రదర్శించారు.

రూ.68 లక్షల కారును తిరిగి ఇస్తారా?

వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నాక ఆఫీసు అవసరాల కోసం రూ.68లక్షలతో ఓ ఖరీదైన కారు కొన్నారని ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. అయితే ఆమె సీఎంఓ, సచివాలయానికి వెళ్లేటప్పుడే ఆ కారును వినియోగిస్తారని, ఆ తర్వాత ఆఫీస్‌కు ఆ లగ్జరీ కారులో రారని కొందరు శాఖలోని అధికారులు పిర్యాదు చేశారు. కుటుంబ అవసరాలకే ఆ కారును వినియోగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బదిలీని ఆపేందుకు విశ్వ ప్రయత్నం?

ఈ స్థానం నుంచి తన బదిలీ విషయం రెండు రోజుల కిందటే తెలిసిందని, ట్రాన్స్‌ఫర్‌ను ఆపేందుకు శ్రీదేవి విశ్వప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. బదిలీని ఆపేందుకు కొందరు జేసీ స్థాయి అధికారులు సీఎస్‌ను కలిసేందుకు శుక్రవారం ప్రయత్నించారని, కానీ అది కుదరలేదని సమాచారం. ఇంకా.. సీఎస్ దగ్గరకు వెళ్లేందుకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని అంటున్నారు. దీంతో బదిలీని ఆపేందుకు వారు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఇంకా కొంతమంది ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech