ఆత్మకూరు( ఎం) ముద్ర : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పల్లెర్ల గ్రామంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు నల్ల చంద్ర స్వామి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణ చేసి మందకృష్ణ మాదిగ ఉద్యమం చేపట్టారని ఆయన తెలిపారు.
30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితంగా సుప్రీం వర్గీకరణ తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం 59 ఉప కులాలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని ఆయన నిర్ణయించారు. ఎంఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల బాలరాజు మాదిగ, మేడి రామ లక్ష్మయ్య, వస్తువుల జంగులు మాదిగ, కొమ్ము మచ్చ గిరి మాదిగ, కొమ్ము రాజు మాదిగ, మేడి స్వామి వివిధ పార్టీల నాయకులు ఏదుల మల్లారెడ్డి, సామ నల్లారెడ్డి, లోడి లింగస్వామి, ఎండి రహీం ఉన్నారు.