- నైపుణ్యాలు పెంపొందించేందుకే ‘యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ’ స్థాపన
- ఈ ఏడాది 2వేలు, వచ్చే ఏడాది 10 వేల మందికి శిక్షణ
- ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు
ముద్ర, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం క్యాంపస్ ఏర్పాటు చేయటం శాశ్వతం. స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ప్రతిపక్షాలకు మద్దతు తెలపాలని ఉంది. నేడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన మంత్రి.. 2 లక్షల ఉద్యోగాలు కల్పించినా, మరో 20 లక్షల మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు గ్రాడ్యుయేట్లలో కొరవడ్డాయని, అందుకోసం పారిశ్రామికవేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించారు. ఇందులో భాగంగా ‘యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ’ స్థాపనకు ప్రతిపాదిస్తున్నట్లు ఉన్నాయి. నైపుణ్యాలు పెంపొందించే ఉద్దేశంతో ‘ఇండియా స్కిల్ వర్సిటీ’ స్థాపన జరుగుతాయి. ప్రవేశపెట్టనున్న అన్ని కోర్సులు 50 శాతం ప్రాక్టికల్ కాంపొనెంట్‌ను కలిగి ఉంటాయని స్పష్టం చేశారు. స్కిల్ యూనివర్సిటీ యువతకు ఉపాధి కల్పిస్తుంది, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు ఈ స్కిల్ వర్సిటీ ఊతమిస్తుందని శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 2వేల మంది విద్యార్థులకు, వచ్చే ఏడాది పదివేల మందికి శిక్షణ ఇవ్వాలని మంత్రి సూచించారు.