ముద్ర ప్రతినిధి, భువనగిరి : జర్నలిస్టుల హక్కులు, సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తున్న యాదాద్రి భువనగిరి ప్రెస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గంధమల్ల రాజు, ఉపాధ్యక్షులు గడ్డమీది చంద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి ప్రెస్ క్లబ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా మీడియా ప్రిన్స్ చౌరస్తా కేక్ కట్ చేసి జర్నలిస్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ జిల్లా వైద్యని జర్నలిస్టులు ఐక్యంగా ఉండి ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు చేసుకోవాలని వారు సూచించారు.
సొసైటీ తరపున ఆపదలో ఉన్న జర్నలిస్టులను సహాయ సహకారాలు అందజేశామని, భవిష్యత్ లో అండగా ఉంటామని తెలిపారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లైన స్థలాలు వచ్చే విధానంగా కృషి చేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గడసందుల నాగరాజు, కోశాధికారి అరె కుమార్, కమిటీ సభ్యులు బాబు, కురెళ్ల మల్లేశం, ఉదయ్ రెడ్డి, లక్ష్మీ నారాయణ, కిషన్, మహేష్, బాలకృష్ణ, చరణ్, బలరాం రెడ్డి, ఫణిదర్, సురేష్, రహమాన్, ఫిరోజ్ సొసైటీ సభ్యులు ఉన్నారు.