ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ప్రాచీన కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. లింగంపేట మండల కేంద్ర నాగన్న బావిని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ కల్పనా రమేష్ తో కలిసి పరిశీలించారు. ప్రాచీన కట్టడాలను పరిరక్షించడానికి ఇన్ఫోసిస్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని, ప్రాచీన కట్టడాలను భావితరాలకు తెలియజేయడానికి స్వచ్ఛంద సంస్థలు వాటిని పునరుద్ధరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ పథకం ద్వారా నాగన్న బావికి వెళ్లడానికి పర్మేషన్ రోడ్డు వేయాలని అధికారులు చెప్పారు. రోడ్డు కిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటాలని సూచించారు. నాలుగు పంచాయతీల ఏర్పాటు హైమాస్ లైట్లు ఏర్పాటు చేశారు. బావి చుట్టూ రక్షణ కంచె ను పరిశీలించారు. త్వరలోనే ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా పునరుద్ధరించబడిన ఈ భావిని ప్రారంభించడం జరుగుతుందని పనులు వేగంగా పూర్తి చేయడం ఎంపీడీవో నరేష్, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈ గిరి లను స్వాధీనం చేసుకున్నారు.