27
ముద్ర,తెలంగాణ:-ఎట్టకేలకు రాష్ట్రంలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్‌ను ముందుకు తీసుకువెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ గురువారం ప్రారంభం. మూడు నెలల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి.. నాలుగు దశల్లో ఈ దరఖాస్తుల స్క్యూటీనీ జరగాలని నిర్దేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామపంచాయతీ మొదలు జీహెచ్‌సీకి సిబ్బంది, దీనికి సంబంధించిన విధులను నిర్దేశించింది. దీంతో 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న 25 లక్షల దరఖాస్తులకు మోక్షం కలగనుంది.