26
ముద్ర, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా, కేంద్రప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని, ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థను ఎలా ప్రైవేటీకరించారని ఆయన ప్రశ్నించారు. గనుల కేటాయింపులో స్పష్టంగా ఉండేందుకే వేలం ప్రక్రియను చేపడుతున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా పాల్గొంటున్నాయని ఆయన ఉన్నారు.