Home తెలంగాణ రైతు రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

రైతు రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
రైతు రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ఏ గ్రామంలో పండుగ చూసిన వాతావరణమే
  • ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం
  • సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్

తుంగతుర్తి ముద్ర:- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీని చెప్పినట్టుగా చేస్తూ ఒక లక్ష 50 వేల రూపాయల రుణాలున్న రైతులకు రుణ విముక్తులను హర్షనీయమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. బుధవారం ముద్రగడ ప్రతినిధితో మాట్లాడుతూ రైతులు అప్పులు తెచ్చి రుణభారంతో ఇబ్బందులు పడుతున్న తీరుకు స్పందించి ఏకంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిన ముఖ్యమంత్రి ముందుగా లక్ష రూపాయల రుణమాఫీ వెనువెంటనే 1,50,000 రుణమాఫీ ప్రకటించడం పట్ల యావత్ రైతాంగం ఆనందం వ్యక్తంచేస్తోందని గ్రామాల్లో రైతులు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు.

అంతేగాక ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల రైతాంగం ప్రభుత్వ పనితీరును ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నెరవేర్చే పద్ధతిని హర్షిస్తున్నారని అన్నారు .పండుగల సీజన్ ఇంకా రాకముందే గ్రామాలలో రైతులు పండగలు జరుపుకుంటున్నారని ఏ రైతు నోట విన్న రుణమాఫీ గురించి చెబుతున్నారని లక్షన్నర రుణమాఫీ అయిందని రైతులు ఆనందంతో బాధపడుతున్నారని అన్నారు . రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ ఎంతో మనోబలాన్ని ఇచ్చిందని అన్నారు. వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేనని అన్నారు.

గత ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ చేస్తానని కొద్ది మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నది వాస్తవం కాదా? అని అడిగారు .ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తానని చెప్పిన గత పాలకులు నాలుగు విడుదల చేసి ఎన్నికల తర్వాత రైతులకు రుణమాఫీ చేయకపోవడం కొంతమందికి చేసి మరికొంతమందికి రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు పూర్తిగా అప్పుల ఊబిలో ఇరుక్కుపోయారని అన్నారు. అలాంటి రైతులకు నేడు కాంగ్రెస్ చేసిన రైతు రుణమాఫీ ఎంతోఊరట ఇచ్చిందని అన్నారు. రైతు రుణమాఫీతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న అభిమానాన్ని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని .రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంకా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు అవుతుందని అనేక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ప్రజలకు తెలుసునని .రానున్న స్థానిక ఎన్నికల్లో మరోమారు కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం అవుతోందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ దిశగా అందరూ కృషి చేయాలని అన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech