మేడ్చల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. మల్లారెడ్డి అనగానే ముందుగా ఆయన మాటలే గుర్తుకొస్తాయి. వివాదస్పద వ్యాఖ్యలే కాదు నవ్వు తెప్పించే వ్యాఖ్యలు చేయడంలోను మల్లన్న ముందు వరుసలో ఉంటారు. అలాంటి మల్లన్న తనకు హోమ్ మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ లో చేరతానని బహిరంగంగా ప్రకటించి వార్తల్లో నిలిచారు.
బీఆర్‌ఎస్ ముచ్చటగా మూడోసారి గెలిస్తే తాను వేరే లెవల్‌లో ఉండేవాడిని, తాను హోం మంత్రిని అయ్యానన్నారు. దీనితో పాటు ఏడాదికి నాలుగు సినిమాలు తీసే వాడిని. కొత్త శాటిలైట్ ఛానల్ కూడా పెట్టేవాడినని. తనకు హోం మినిస్టర్ పోస్ట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. మరి దీనికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకరిస్తారా? అని కూడా మల్లారెడ్డి సందేహం వ్యక్తం చేశారు. వందశాతం సీఎం రేవంత్ రెడ్డి తనను కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వడని కూడా స్పష్టం చేశారు. తనను పార్టీలో చేర్చుకునే మధ్యవర్తిత్వాన్ని ఆయన జర్నలిస్టులను చేర్చుకున్నారు. హోంమంత్రి పదవి ఇచ్చేటట్లు సీఎం రేవంత్ తో మాట్లాడాలని జర్నలిస్టులను మల్లారెడ్డి నిర్దేశించారు. మరి మల్లారెడ్డి వ్యాఖ్యలపై సీఎం ఏమైనా కనిపిస్తారా అనేది చూడాలి.