ముద్ర ప్రతినిధి, భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి రైతుల మేలు జిల్లాకు ప్రత్యేకంగా రుణమాఫీ పథకం తెచ్చిందని కలెక్టర్ హనుమంత్ కే.జెండగే తెలిపారు. మంగళవారం రైతు రుణ మాఫీ రెండవ విడుత నిధుల విడుదల కార్యక్రమం పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ, కోఆపరేటివ్, బ్యాంకర్ల అధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ప్రాంగణం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రెండవ విడుత రుణ మాఫీ నిధుల విడుదల ప్రకటన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. అనంతరం జిరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రెండవ విడుత రైతు రుణమాఫీ నిధుల విడుదల పట్ల రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 17 రైతు వేదికలలో రైతు నేస్తం కార్యక్రమం క్రింద రైతులు ముఖ్యమంత్రి సందేశాన్ని చూశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతుల మేలు కోసం రైతు రుణ మాఫీ పథకం తెచ్చిందని, తేది.09-12-2023 వరకు రైతుల రుణాలకు సంబంధించి రెండు లక్షల వరకు రుణ మాఫీ జరుగుతుందని, ఈ నెల 18న మొదటి రుణ మాఫీ క్రింద ఒక లక్ష రూపాయల వరకు జిల్లాలో 36,483 మంది రైతులకు 199 కోట్ల 87 రుణ మాఫీ చేయడం జరిగింది.
ప్రస్తుతం రెండవ విడుత రైతు రుణ మాఫీ క్రింద ఈరోజు జిల్లాలో 16,143 మంది రైతు కుటుంబాలకు 165 కోట్లు, 87 లక్షల 29 వేల 511 రూపాయలు రుణ మాఫీ చేసినట్లు చెప్పారు. రైతులకు సకాలంలో రుణం అందిస్తే విత్తనాలు, పెట్టుబడికి ఉపయోగం అవుతుందని, రైతులకు రుణం భారంగా మారినందున రుణ మాఫీ చేపట్టడం జరిగింది. జిల్లా స్థాయిలో రైతులకు రుణమాఫీపై ఎలాంటి సమస్యలు ఉంటే 08685- 293312 టోల్ ఫ్రీ నెంబరులో సంప్రదించాలని, ప్రతి క్లస్టర్ రైతు వేదికలలో రైతులు తమ ఆధార్ వివరాలను వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే వారు అన్ని విషయాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్యాంకర్లు రుణమాఫీ ప్రక్రియలో పాత్ర పోషించాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణ మాఫీని రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలని, కీలకమైన రెన్యువల్ చేసినట్లు సూచించింది. ఈ కార్యక్రమంలో రైతులు శీలం, మంగమ్మ, మల్లేశం, శ్రీహరి, సావిత్రి తమకు రుణమాఫీ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ తిరిగి వ్యవసాయానికి పెట్టుబడిగా వాడతామని చెప్పారు. చివరగా రైతులకు రుణ మాఫీ చెక్కులను జిల్లా కలెక్టర్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ, ఏరువాక శాస్త్రవేత్త అనిల్ కుమార్, జిల్లా లీడ్ మేనేజరు శివరామకృష్ణ, జిల్లా సహకార అధికారి నాగమణి, అధికారులు తెలిపారు.