25
ముద్ర, తెలంగాణ బ్యూరో : సింగరేణిలో దాదాపు రూ.10 వేల నుంచి రూ. 12 వేల కోట్ల వరకు అవినీతి జరిగింది కూనంనేని సాంబశివరావు. ఈ రోజు తాను గతంలోనే చెప్పానని, విచారణ కమిటీ వేయాలని కూడా గతంలో చెప్పానని గుర్తుచేశారు. సోమవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన విద్యుత్‌పైనే కాదు సింగరేణి సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు.
సింగరేణికి ప్రభుత్వం నుంచి రూ.21 వేల కోట్లు రావాలని ఉద్ఘాటించారు. సింగరేణిలో జరిగిన అవకతవకలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యుత్, సింగరేణిని కలిపి విచారణ చేపట్టాలని. విద్యుత్ ప్లాంట్లలో సబ్ క్రిటికల్ టెక్నాలజికి వెళ్లడం వెనక మతలబు ఏంటో అని ప్రశ్నించారు. సింగరేణి, కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఒక సమగ్రమైన ఆలోచన విధానంతో ప్రభుత్వం ముందుకెళ్లాలని సూచించింది.