Home తెలంగాణ వ్యవసాయ అధికారులు సూచించకుండానే తమ ఇష్టానుసారంగా కలుపు మందులు ఇస్తున్న దుకాణదారులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

వ్యవసాయ అధికారులు సూచించకుండానే తమ ఇష్టానుసారంగా కలుపు మందులు ఇస్తున్న దుకాణదారులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
వ్యవసాయ అధికారులు సూచించకుండానే తమ ఇష్టానుసారంగా కలుపు మందులు ఇస్తున్న దుకాణదారులు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • రకం కలుపు మందు ఒకే దుకాణంలో ఒక్కో దరకు విక్రయిస్తున్న తీరు
  • అధికారుల పర్యవేక్షణ లోపమా ?లేక దుకాణదారుల ఇష్టారాజ్యమా?
  • ఒక్కో ఎకరాకు 4 వేల రూపాయల కలుపు మందులు సైతం అంట కడుతున్న దుకాణదారులు

తుంగతుర్తి ముద్ర:-ఒకపక్క అరకొర వర్షాలు మరో పక్క పెరుగుతున్న ఎరువులు పురుగు మందుల పెట్టుబడులతో రైతాంగం సతమతమవుతుంది .ఇటీవల వారం రోజులు రోజువారీగా వర్షపు జల్లులు కురిసిన తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ ఒక్క చెరువు గాని కుంటగాని నీటితో నిండి అలుగులు పోయాయి. కురిసిన వర్షపు జల్లుల ఆధారంగా కొద్ది గొప్ప వరి నాట్లు వేసిన రైతాంగానికి కలుపు మందుల వాడకంలో వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.

వరి నాట్ల కూలీల రేట్లు తట్టుకోలేక డ్రం సీడర్ ద్వారా వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసిన రైతాంగం వరిలో కలుపు నివారణ కోసం కలుపు మందుల కోసం పురుగు మందులను ఉపయోగించేందుకు వెళ్లి కలుపు మందులను అందించడానికి కోరిన ఒక్కో ఎకరాకు సుమారు నాలుగువేల రూపాయలకు తగ్గకుండా కలుపు మందులు ఇస్తున్నట్లు సమాచారం. రైతులు తమ పొదుపులో కలుపు నివారణకు మందులు అందించాలని కోరిన పక్షంలో ఒక్కోరకానికి కలుపు మందులు ఇస్తున్నట్లు చెబుతారు. లేక ఎక్కువ మోతాదులో కొట్టారు, లేక నీరు తీయలేదు, అనే సాకులు చెబుతున్నారు .రైతు తాను సక్రమంగానే పిచికారి చేశానని చెప్పినా మరో మారు స్ప్రే చేయాలని చెబుతున్నట్లు సమాచారం .లేదా ఆ రకం కలుపుకు మీరు కలుపు మందు తీసుకోలేదని దుకాణదారులు చెబుతున్నట్లు సమాచారం . గాని ఏ రకం వాడాలో ప్రిస్క్రిప్షన్ రాసిస్తేనే దాని ద్వారానే దుకాణదారులకు అవసరమైన పురుగుమందులు ఇవ్వాల్సి ఉంటుంది .కానీ ఆ నిబంధనను తుంగతుర్తి ప్రాంతంలో తుంగలో తొక్కి దుకాణదారులు తమ ఇష్టానుసారముగా పురుగు మందులు కలుపు మందులు ఇస్తున్నట్లు సమాచారం.

ఒక్కో దుకాణానికి ఒక్కో ధర నిర్ణయించి పురుగుమందులు కలుపు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు .వ్యవసాయ అధికారులు సైతం దుకాణదారులు రైతులకు ఏమి చేస్తున్నారని తెలుసుకోలేకపోతున్నారు. కొంతమంది దుకాణదారులు వారే పొలాల వద్దకు మీ పొలంలో ఫలానా రకం కలుపు ఉంటే ఆ కలుపుకు ఫలానా రకం కల్పమందు వాడాలని సూచిస్తున్నారు. వారు చెప్పిన విధంగా కలుపు మందులు వారిచ్చే ధరకు కొనుగోలు కొనుగోలు సమాచారం. ఎవరైనా రైతు ధర ఎక్కువ ధర ఏమిటని ప్రశ్నించినట్లు తాము ఎమ్మార్పీ రేటు కన్నా తక్కువకి అమ్ముతున్నామని చెబుతున్నట్లు దుకాణాదారు కొనుగోలు చేసిన రేటు తక్కువ ధరకు ఎలా ఇస్తారన్నది ఆలోచించాల్సిన విషయం .ఒకే కలుపు దుకాణానికి ఒక ధర రైతులకు ఇస్తున్నట్లు. తుంగతుర్తి మండలం లోని పలు పురుగుమందులలో ఇలాంటి పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. గత సంవత్సరం కూడా కలుపు మందులు పిచ్కారి చేసిన రైతులకు సగం కలుపు పోగా తీవ్ర నష్టాల బారిన పడిన సంఘటనలు జరిగినట్లు రైతులు చెబుతున్నారు .

అసలు పురుగు మందుల దుకాణాల్లో ఏ రకం కలుపు మందులు అమ్మకాలు చేస్తున్నారు ,వారు అమ్మకాలు చేసే మందులు సరైనవేనా? వ్యవసాయ శాఖ అధికారులు రైతుల పొలాలను పరిశీలించి ఫలానా కలవమందులు వాడాలని సూచిస్తున్నారా? అనేది ప్రధాన ప్రశ్నలు రైతుల నుండి . ఇకనైనా వ్యవసాయ శాఖ అధికారులు పురుగుమందుల ఉత్పత్తులను తనిఖీలు చేసి వారు విక్రయిస్తున్న పురుగు మందులు కలుపు మందులను పరిశీలించి అమాయక రైతులు వారి బారిన పడకుండా ఆర్థికంగా పోకుండాచర్యలు తీసుకోవాలని కోరుతోంది . ప్రస్తుత సీజన్‌లో వరి పంటకు కలుపు నివారణ కోసం కలుపు మందులు వాడడం వల్ల రైతులు మోసపోకుండా వారికి అవసరమైన కలుపు మందుల దుకాణదారులు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech