22
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిగా సభ్యులుగా ఎన్నుకున్నారు. మరోవైపు ఉపాధ్యక్ష పదవికి అశోక్‌కుమార్,వైవీఎస్ చౌదరి పోటీ పడుతున్నారు. నిర్మాతల నుంచి ఉపాధ్యక్షుడి ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని 48 మంది సభ్యులు ఎన్నుకుంటారు. ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో సెక్టార్‌లోని సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దిల్ రాజు పదవి కాలం ముగియడంతో ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరుగుతున్నాయి. బైలా ప్రకారం దిల్ రాజ్ పదవికాలం ముగిసింది.