28
ముద్రణ ప్రతినిధి, భువనగిరి : బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శిగా ధీరావత్ వెంకటేష్ నాయక్ ను నియమిస్తూ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు అజ్మీర కిషన్ నాయక్ నియామక పత్రాన్ని శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా అజ్మీర కిషన్ నాయక్ మాట్లాడుతూ గిరిజన సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ధీరావత్ వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి ఇచ్చినందుకు జిల్లా అధ్యక్షులు అజ్మీరా కిషన్ నాయక్, గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి భూక్యా నరేష్ నాయక్ ల కు కృతజ్ఞతలు తెలిపారు.