27
ముద్ర. వీపనగండ్ల:- వరి తూకాలు వేసిన కొందరు రైతులు వాటి రక్షణ కోసం పార్టీల జెండాలను బతుకమ్మ చీరలతో రక్షణగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వరి తుకాల ను పక్షులు పందుల బెడద నుంచి కాపాడుకోవడానికి తూకాల చుట్టూ పార్టీల జెండాలను పాతి రక్షణగా చేసుకుంటున్నారు.
జెండాలు గాలికి విసురుగా ఊగినప్పుడు పక్షులు తూకాల పై వలవని, మరో రాత్రి వేళ జెండాల గాలికి అడవి పందులు కూడా రావని అందుకే రైతులు వినూత్నంగా ఆలోచించి తూకాల చుట్టూ వివిధ పార్టీల జెండాలను పాతి ఉంచారు. మరికొందరు రైతులు తూకం పోసిన వడ్లపై బతుకమ్మ చీరలతో పాటు వివిధ రకాల చీరలను పక్షుల నుంచి కాపాడుకోవడానికి కప్పి ఉంచుతున్నారు. రోడ్ల వెంట వెళ్లే ప్రయాణికులు వాహనదారులు వివిధ రకాల జెండాలను చీరలను చూసి నవ్వుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది.