తుంగతుర్తి ముద్ర:- తుంగతుర్తి నియోజకవర్గం గత ప్రభుత్వ హయాంలో వంద పడకల ఆసుపత్రికి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ శంకుస్థాపన చేయగా అనంతరం మరో శాసనసభ్యులు శంకుస్థాపన చేసి ఆసుపత్రిలో గడచిన ఐదు నెలలుగా ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించారని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబు అన్నారు. ఆగిపోయిన ఆసుపత్రి నిర్మాణాన్ని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గతంలో ఉన్న పీహెచ్‌సీలో కొంత భాగం కూల్చి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపడతామని పనులు ప్రారంభించారని అన్నారు.
ఆసుపత్రిలో ఉన్న ఆపరేషన్ థియేటర్ కూల్చివేయడంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు సాధారణ ప్రసూతికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వివిధ జబ్బులు నానా ఇబ్బందులు పడుతున్నారు .అంటేకాక అత్యవసర సమయంలో సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సిన గర్భిణీలు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి వెళ్ళవలసి వస్తుందని ఆసుపత్రి నిర్మాణం సత్వరమే పూర్తి చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అన్నారు. అదనంగా ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లను డిప్రెషన్‌లపై పంపగా ప్రస్తుతం ఇద్దరే మిగిలారని అన్నారు .ఆసుపత్రిలో వైద్యుల సంఖ్యను పెంచుతూ తక్షణమే నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని జాప్యం లేకుండా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.