- మాది సంక్షేమం, అభివృద్ధి
- బీఆర్ఎస్ది సొంత ఎజెండా
- గత పదేండ్లలో అస్తవ్యస్థ పాలన
- బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ముద్ర, తెలంగాణ బ్యూరో :రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో భట్టి విక్రమార్క గత బీఆర్ఎస్ పాలనపై ఉంది. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి దశాబ్దకాలంలో ఆశించిన స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లిందని, అభివృద్ధి అడుగంటుతుందని అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైనదని బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి.. ముందుగా ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి కవితతో భట్టి బడ్జెట్ స్పీచ్. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావిస్తూ గత పదేళ్లలో అస్తవ్యస్త పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రం వచ్చాక అప్పు పదిరెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెను సవాల్ అని స్పష్టం చేశారు. దుబారా తగ్గించాం, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని వివరించారు. బంగారు తెలంగాణ పలికిన ఉత్తరకుమార ప్రగల్భాలు, గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. గత పదేళ్లలో ప్రభుత్వ అప్పు పది రెట్లు పెరిగిందని చెప్పారు.
పదేళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బంగారు తెలంగాణ పలికిన ఉత్తరకుమార ప్రగల్భాలు, గత పదేళ్లలో ప్రభుత్వ అప్పు పది రెట్లు పెరిగిందని, వామనావతారం లెక్క అప్పులు పెరిగాయని. ఓ వైపు అప్పులు పెరగగా, మరోవైపు బిల్లుల బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు.
క్రమశిక్షణతో దిద్దుబాటు
గత ప్రభుత్వ విధానాలతో ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, దిద్దుబాటు చర్యలు చేపట్టి మేలైన ప్రాజెక్టులు నిర్మిస్తామని భట్టి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి, నియామకాల్లో పారదర్శకతకు చర్యలు తీసుకుంటారు, త్వరలో నియామక ప్రణాళిక క్యాలెండర్ ప్రకటన, బడ్జెట్ కేవలం అంకెల కొత్త సమాహారం కాదని, బడ్జెట్ అనేది విలువలు, ఆశల వ్యక్తీకరణ కూడా అవుతాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న భారీ, మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల నిర్వహణ కూడా గత పదేళ్లలో జరగకపోవడం వల్ల ఆ ప్రాజెక్టుల సామర్ధ్యానికి అనుగుణంగా ప్రజలకు మేలు జరగలేదని, అవి అలాగే వదిలేస్తే మన జాతీయ సంపదగా భావించే ప్రాజెక్టులు నిరుపయోగం అవుతాయన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మత్తులను తగిన సమయంలో చేపట్టడానికి నిశ్చయించామని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రేవంత్ రెడ్డి సారథ్యం ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది.
అప్పుల కోసం అప్పులు
గత ప్రభుత్వ నిర్వాకం వల్ల చివరికి అప్పులు కట్టడానికి అప్పులు తీసుకునే పరిస్థితి రాష్ట్రం దిగజారిందని భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన సమయానికి రాష్ట్ర అప్పులు 75,577 కోట్లు అని, గత ఏడాది డిసెంబర్ నాటికి అవి రూ. 6,71,757 కోట్లకు చేరాయని, పదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు పదిరెట్లు పెరిగిందని చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల చివరికి అప్పులు కట్టడానికి అప్పులు తీసుకునే పరిస్థితి దిగజారిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా.. సంక్షేమాన్ని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించలేదని చెప్పారు. దశాబ్దకాలంలో తెలంగాణ పురోగతి జరగలేదని, అన్ని రంగాల్లో గత ప్రభుత్వం విఫలమైంది. ఆర్థిక క్రమశిక్షణతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొదలైందని, ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నామన్నారు.
నాణ్యత లేకుండా ప్రాజెక్టులు
నాణ్యతలేని పనులతో బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల ఫలితాలు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి పనులు చేశారు. రైతుల సాగునీటి సమస్యలు పరిష్కారం కాలేదని, ఒంటెద్దు పోకడలతో సొంత జాగీరుల గత పాలన సాగిందని, దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులకుప్పలా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రమంతా తెలుసునని, దానిపై న్యాయవిచారణ జరుగుతుందని భట్టి సభలో చెప్పారు.