- బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత
తుంగతుర్తి ముద్ర:-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా అమలు చేస్తానన్న హామీలను అమలు చేస్తానని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబు అన్నారు.సోమవారం కామారెడ్డి బిసి డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే కులగతులను చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీల రిజర్వేషన్లు పెంచుతామని, అలాగే స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న 23 శాతం నుంచి 42 శాతం పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సివిల్ సప్లై మెయింటెనెన్స్ కాంట్రాక్టులో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారని ఇంతవరకు అమలు కాలేదని అన్నారు.
గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ హామీ ఇచ్చారని, అలాగే చట్టబద్ధమైన హోదాతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి లక్ష కోట్ల నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం ఏర్పాటైంది. బీసీ యువతకు ఉద్యోగ అర్హతలు కూడా ఇవ్వలేదని .మత్స్య సంఘాల వారికి ఇంతవరకు చేప పిల్లల పంపిణీ చేయలేదని అన్నారు .ముదిరాజ్ ,గంగపుత్ర ,గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి, విశ్వకర్మ, రజక సామాజిక వర్గాలకు ఇంతవరకు ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని అన్నారు. బీసీ డిక్లరేషన్ అమలు చేయనందుకు బిజెపి ఆధ్వర్యంలో తాము తీవ్రంగా పోటీ చేస్తామని అందులో భాగంగానే తాము స్థానిక తహశీల్దారుకు వినతిపత్రం అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గడ్డం ఉప్పలయ్య, ఉప్పుల లింగయ్య, రఫిక్ ,నాగయ్య ,వెంకన్న, కత్తుల నరేష్ , ,నవీన్, లింగస్వామి మనోజ్ ,కాశయ్య ఉన్నారు.