7
- ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మర్యాదపూర్వకంగా కలిసిన తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు
తుంగతుర్తి ముద్ర:- తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన సూర్యాపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు ఢిల్లీలో మంగళవారం భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు .ఈ సందర్భంగా ఎంపీని శాలువాతో సన్మానించి బొకే ఇచ్చి సన్మానించారు. అలాగే ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలాంబ ను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావులతో మర్యాదపూర్వకంగా కలిశారు.