ముద్ర ప్రతినిధి, నిర్మల్: సొంత ఇంటిలోనే దొంగతనం చేసిన వ్యక్తిని నిర్మల్ పట్టణ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేసారు. పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ కథనం ప్రకారం స్థానిక మహదేవపూర్ కాలనీలో నివాసం ఉండే అనిత రాణి సోఫీనగర్లోని గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ నెల19న ఉదయం స్కూల్ కి తన భర్త బైక్ పై వెళ్ళింది. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి డోర్ ఓపెన్ చేసి ఉన్నది. బీరువాలో వస్తువులు చిందరవందర గా ఉండటం చూసి బీరువాను చూసే 8 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు.
ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగిలించారని ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల కెమెరాలను పరిశీలించారు. ఆమె భర్త సవులే శివ యే దొంగతనం చేసినట్టు కనిపెట్టారు. అతనిని పట్టుకొని విచారించగా తనే నేరం చేసినట్టు అంగీకరించాడు. అతని నుండి రూ.3.20 లక్షలు విలువ చేసే 8.1 తులాల బంగారు ఆభరణాలు, 6 తులాల వెండి ఆభరణాలు స్వాదీనపర్చుకొని అతని రిమాండ్ కి. ప్రజలందరూ వారి ఇండ్ల ముందు, వ్యాపార సముదాయాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని నేరాలను అరికట్టడంలో ఇవి ఎంతో తోడ్పడతాయని ఆయన చెప్పారు.