ముద్రణ ప్రతినిధి, నిర్మల్:ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు ఆదిలాబాద్ రహదారిపై మహబూబ్ ఘాట్ సమీపంలో కారు లోయలో పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురిని నిర్మల్ పోలీసులు కాపాడారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నుండి నాగపూర్ కి వెళ్తున్న కారు మహబూబ్ ఘాట్ రెండవ సెక్షన్ లోయలో పడింది. పొగ మంచు ఎక్కువ రావడంతో దారి కనిపించక, అదుపు తప్పి లోయలో పడిపోయింది.
100 ద్వారా సమాచారం అందుకున్న నిర్మల్ పోలీసులు నిర్మల్ డీ సి ఆర్ బి ఇన్స్పెక్టర్ గోపినాథ్,సారంగాపూర్ శ్రీకాంత్ ఎస్ఐ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బోల్తా పడిన వాహనాన్ని లోయలో గుర్తించి కారులో ఉన్న రాధా కృష్ణను, ఆయన భార్యను, కుమారుడిని కాపాడారు. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. హైదరాబాద్ సరూర్ నగర్ కి చెందిన వీరిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం. ఇన్స్పెక్టర్ గోపీనాథ్, సారంగాపూర్ జిల్లా ఎస్ఐ – శ్రీకాంత్ తదితర పోలీసు సిబ్బందిని ఎస్పీ డా.జానకి షర్మిల అభినందించారు.