- అందితే జుట్టు, లేకుంటే కాళ్లు అన్న చందంగా కేటీఆర్ వైఖరి….
- కేటీఆర్ పై విరుచుకుపడ్డ బీర్ల….
ముద్ర ప్రతినిధి, భువనగిరి : రాజ్యాంగానికి విలువ ఇవ్వని బిఆర్ఎస్ అని అందితే జుట్టు, లేకుంటే కాళ్లు అన్న చందంగా కేటీఆర్ వైఖరి లేదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విరుచుకుపడ్డారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణ భవన్‌ని బీర్ల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్ ముందు బిఆర్‌ఎస్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థపై అనేక అపోహలు, అనుమానాలు, అవమానాలు చేసిన నేతలకు నేడు గవర్నర్ కలవడానికి సిగ్గుపడాలని అన్నారు.
గవర్నర్ వ్యవస్థపై బిఆర్ఎస్ నేతలకు నమ్మకం ఉందా అని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. తెలంగాణలో రాజ్యాంగంపై దాడి జరిగిన బిఆర్ఎస్ నేతలు అనడం వారి అవివేకానికి నిదర్శనమని చెప్పారు. రాజ్యాంగానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా నియంతృత్వ పాలనను తెలంగాణలో కొనసాగించింది నిజం కాదా అని ప్రశ్నించారు. తమ పార్టీ శాసనసభ్యులు ఫిరాయింపులకు గొంతు విప్పి రాజ్ భవన్ ముందు కేటీఆర్ చించుకుంటున్నారని కానీ తమ పార్టీ అధికారంలో ఉన్న గత 10 సంవత్సరాలుగా ఆయన గొంతు ఎందుకు మూగబోయిందో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ప్రతిపక్షాలే లేకుండా కేసీఆర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కేటీఆర్ ఎందుకు మౌనవ్రతం పాటించారని ప్రశ్నించారు. ఫిరాయింపులపై ఫిర్యాదు చేయడానికి కేటీఆర్ కు ఏ మాత్రం ఇంకాస్త జ్ఞానం ఉన్న వెంటనే గతంలో తమ పార్టీ, ప్రభుత్వం చేసిన ఫిరాయింపులపై ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సూచించారు. రుణమాఫీ తో రైతులంతా సంతోషంగా ఉంటే కల్వకుంట్ల కుటుంబంలో కుట్రతో రగిలిపోతుందని మాత్రం. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందెపు సంజీవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఉన్నారు.