హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని వినతి
జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్‌కు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ జెసిహెచ్ఎస్ఎల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో కో ఆపరేటివ్ కమీషనర్ మరియు రిజిస్ట్రార్ కో ఆపరేటివ్ సొసైటీస్ పి.ఉదయ్ కుమార్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నికలు జరపడానికి సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా నాన్ అలటీ సభ్యులు తీవ్రంగా నష్టపోయారని విన్నవించారు. ఉత్తర్వుల ప్రకారం సోసైటిలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ హైకోర్టు ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని. 4 లోపు ఎన్నికలు పూర్తి చేయాలని కోరుకున్న నెలల కమీషనర్ సానుకూలంగా స్పందించారు. అధికారులతో మాట్లాడి తొందరగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నిత్యం అనేక ఇబ్బందులు పడుతూ జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతూ ప్రజలకు వారధిగా ఉంటున్న జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు అందించడానికి జెసిహెచ్ఎస్ నాయకులు ఉన్నారు. కమీషనర్ ను కలిసిన వారిలో జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నాయకులు బ్రహ్మండబేరి గోపరాజు ,భీమగాని మహేష్ గౌడ్, సునీత,గయాస్ పాషా,జి.రఘు,పి.సాగర్,పర్వీన్ ,ఎం.శ్రీనివాస్ ,రామకృష్ణ ,కె.రాజు,విఘ్నేశ్వర్ రావు,మునిరాజు ఉన్నారు.