సూర్యాపేట ముద్ర ప్రతినిధి:- రూ.25 వేలు లంచం తీసుకుంటూ సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ శుక్రవారం ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. సూర్యాపేట జిల్లా ఆసుపత్రిని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆయన ఇంట్లో పట్టణానికి చెందిన సొసైటీ సభ్యుల డబ్బులు తీసుకున్నప్పుడు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అలాగే అధికారులు వెంటనే ఇంట్లో సోదాలు చేస్తున్నారు. రూపేందర్ సింగ్ పై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కాగా రూపేందర్ సింగ్ ఏసీబీకి పట్టుబడటం ఇది రెండోసారి కావడం విశేషం. మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా గతంలో పనిచేస్తున్న సమయంలో ఏసీబీ వలలో చిక్కుకున్నారు. రూపేందర్ సింగ్ తన ఒరిజినల్ పోస్ట్ మత్స్య శాఖలో అసిస్టెంట్ ప్రస్తుతం అతని ఇంట్లో ఏసీబీ అధికారులు ఇంకా సోదాలు నిర్వహించడంతోపాటు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.