41
ముద్ర,సెంట్రల్ డెస్క్:-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఉంచారు. ఈ రాజీనామా పత్రాన్ని ముర్ము తక్షణమే ఆమోదించారు. ఆయన రాజీనామాతో మంత్రి వర్గం మొత్తం రద్దయింది. కేంద్ర మంత్రులందరూ మాజీలు అయ్యారు.కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉండాలని ద్రౌపది ముర్ము.. మోదీని నిర్ణయించారు. దీనికి ఆయన అంగీకరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు మోదీ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు.