42
ముద్ర,సెంట్రల్ డెస్క్:– నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్తవ్యపథ్ లో ఈ నెల 8వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సాయంత్రం ఎన్డీఏ పక్షాలతో కలసి రాష్ట్రపతిని కలవనున్నారు. మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎన్డీఏకు పూర్తి స్థాయి బలం రావడంతో ఆయన మూడోసారి పదవినిచేపట్టబోతున్నారు. రికార్డును సృష్టించబోతున్నారు. అదే రోజు తొలి విడత మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది.