33
ముద్ర,సెంట్రల్ డెస్క్:-ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే, ఇండియా కూటమిల మధ్య హోరాహోరీ పోరుతో సోమవారం స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్ర ఒడిదుడుకులతో సాగుతూ ఇన్వెస్టర్లు భారీ నష్టాలు మిగిల్చాయి.అంచనాలకు విరుద్ధంగా ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య భీకర పోరు సాగుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. మదుపరుల ఊగిసలాట మధ్య మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.బీఎస్ఈ సెన్సెక్స్ ప్రస్తుతం 5000 పాయింట్లుపైగా కుప్పకూలింది. పలు కంపెనీల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. స్టాక్ మార్కెట్ల పతనంతో ఒక్కరోజే రూ. 26 లక్షల కోట్ల విలువైన సంపద ఆవిరైంది.