43
ముద్ర,సెంట్రల్ డెస్క్:-ఢిల్లీలో నీటి కొరతపై ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీలో సమస్యపై ఆప్ సర్కార్ న్యాయపోరాటానికి సిద్ధం అయింది. హక్కుగా తమకు రావాల్సిన నీళ్లను కూడా ఇవ్వడం లేదంటూ ఆప్ సుప్రీం మెట్లెక్కింది. హర్యానా, యూపీ, హిమాచల్ ప్రదేశ్ నుంచి నీటిని విడుదల చేయడం లేదని, ఢిల్లీలో బిందెడు నీళ్ల కోసం కొట్టుకోవాల్సిన పరిస్థితి లేదని ఆప్ ఆరోపిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై పానీపట్టు యుద్ధం జరుగుతోంది. ఒక్క వాటర్ ట్యాంకర్ వస్తే నిమిషాల్లో ఖాళీ అవుతోంది.స్లమ్ ఏరియాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. నీటిని వృథా చేస్తే రూ. 2 వేలు వేస్తామని ఆప్ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది.