48
ముద్ర,సెంట్రల్ డెస్క్:-కారు కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించిన విషాద ఘటన మహారాష్ట్రలో సంభవించింది. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబమంతా పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తాస్గావ్లోని రాజేంద్ర పాటిల్ కుటుంబం మంగళవారం కవ్ఠేమంకాల్ గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు వెళ్లారు. తిరిగి వస్తుండగా తాస్గావ్ మనెరాజు మార్గంలోని చించాణి సమీపంలోని టకారి కెనాల్లోకి కారు దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు మరణించారు.