39
ముద్ర,తెలంగాణ:-ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. కార్మికుల పికప్ వాహనం బోల్తా పడి 17 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి చేర్చారు. వాహనం బోల్తా ఘటనలో 17 మంది మృతి చెందారని.. మరో ఎనిమిది మంది గాయపడ్డారని.. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు కవార్ధా ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు.