36
టపాకాయల తయారీకి ప్రసిద్ధి చెందిన తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలో సంభవించిన భారీ పేలుడు సంఘటనలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ముడిసరుకును గోదాములో నిల్వ చేస్తున్న సందర్భంలో ఈ భారీ విస్ఫోటం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో మరో పది మంది దాకా గాయపడ్డారు. టపాకాయల తయారీ కేంద్రానికి బాణసంచా ముడిసరుకును చేరవేస్తుండగా ప్రమాదవశాత్తు ఈ విస్ఫోటం జరిగింది. పేలుడు తీవ్రతకు అక్కడికక్కడే ఏడుగురు వ్యక్తులు చనిపోగా, పది మంది గాయపడ్డారు. చనిపోయిన ఏడుగురిలో అయిదుగురు మహిళలే ఉన్నారని సమాచారం. స్థానికులు వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించడంతో, వారు వచ్చి మంటలను ఆర్పడానికి కృషి చేస్తున్నారు. ఫ్యాక్టరీలో ముడిసరుకు చాలా ఎక్కువ స్థాయిలో నిల్వ ఉండటంతో మంటలను అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది.