38
ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముస్సోరీలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు కాలేజీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కారు లోయలో పడిపోవడం వల్ల శనివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో నలుగురు యువకులు, ఓ యువతి గుర్తించారు. తీవ్రంగా మరో యువతి గాయపడిందని సమాచారం. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులంతా డెహ్రాడూ ఐఎంఎస్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా ఉన్నారు.