38
- కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ప్రశ్న
ప్రధాని నరేంద్ర మోదీకి కేవలం పెద్ద మనుషులు మాత్రమే కనిపిస్తారని, సామాన్యులు కనిపించరని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ. గుజరాత్ రాష్ట్రం ప్రధానికి గౌరవం, ఆత్మగౌరవం ఇచ్చి అధికారాన్ని కట్టబెట్టిందని, అయితే ఆయన పెద్దమనుషులతో మాత్రమే కనిపిస్తారని ఆమె అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బనస్కాంతలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ, ఏనాడైనా ప్రధాని నరేంద్ర మోదీ ఒక రైతును కలవడం ఎవరైనా చూశారా అని ఆమె ప్రశ్నించారు. వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. వందలాది మంది రైతులు ప్రధాని బలిదానాలు చేసుకున్నా వారిని కలవడానికి కూడా వెళ్లడం లేదు. ఎన్నికలు వచ్చి మనకు ఓట్లు పడవని భావించిన ప్రధాని మోదీ చట్టాన్ని మార్చారని ఆమె దుయ్యబట్టారు.