
Chiranjeevi : సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 2014లో కాంగ్రెస్ నేతగా చిరంజీవి ఎన్నికల ప్రచారంలో కొనసాగారు. అయితే నిర్ణీత సమయంలో మీటింగ్ పూర్తి చేయకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు వచ్చాయని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఓ వ్యక్తి గుంటూరులో చిరంజీవిపై కేసు పెట్టారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు చిరంజీవిపై నమోదైన కేసును కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.