
గతంలో కేసు నమోదు
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో గతంలో ఫోర్జరీ కేసు నమోదు అయింది. ఎమ్మెల్యేపై ఆయన కుమార్తె తుల్జా భవానీ రెడ్డి ఈ కేసు పెట్టారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఎకరా ఇరవై గుంటల భూమిని తన పేరు మీద తీసుకున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎప్పటి నుంచో ఈ భూవివాదం నడుస్తోంది. చెరువు భూమిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేశారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే ఇదే విషయమై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు చేశారు. భవానీ రెడ్డి ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 406, 420, 463, 464, 468, 471 ఆర్/డబ్ల్యూ 34ఐపీసీ, 156(3) సీఆర్పీసీ ప్రకారం కేసులు పెట్టారు.