
జనసేన అధినేత పవన్ కళ్యాణ్: జనసేనకు అధికారం తెలియజేస్తోంది ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. వారాహి విజయ యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ బస్టాండ్ కూడలిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సగటు మనిషి మీద, ఏ హనీ చేయని వ్యక్తి మీద, శుభ్రంగా ట్యాక్సులు కట్టే వాడి మీద దౌర్జన్యాలు చేస్తే మాత్రం వైసీపీ గుండాలకు నరకం చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అవ్వడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. 2019లో కూడా ఇంత బలంగా చెప్పలేదని… కానీ శ్రీపాద వల్లభుడు సాక్షిగా చెబుతున్నానని… ఇప్పుడు మాత్రం సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. కానీ ప్రజలకి జనసేనకు పూర్తిగా మెజార్టీ ఇవ్వాలి…