
కేసు నమోదు…
ములుగు జిల్లా తాడ్వాయి పోలీసస్టేషన్‌లో గత ఏడాది ఆగస్టు 19న పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. పెట్టారు. బీరెల్లి గ్రామం వద్ద ఆరోజు తెల్లవారుజామున మావోయిస్టు పార్టీ సభ్యులు కొందరు సమావేశమవుతున్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు… అక్కడ్నుంచి తప్పించుకున్నారని పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతంలో దొరికిన పత్రాల్లో అనేక ప్రజాసంఘాల నేతలతో మావోయిస్టులకున్న సంబంధాలపై ఆధారాలు లభించాయంటూ ఉపా కేసును నమోదు చేసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్నతోపాటు ప్రొఫెసర్ హరగోపాల్, మరో ప్రొఫెసర్ పద్మజాషా, విమలక్క, కోయ్యడ సాంబయ్య, కనకాల రాజిరెడ్డి, కుర్సం మగ్గు, మడకం సనల్, సహా మొత్తం 152 మంది 120 బీ, 147, 148, రెడ్‌విత్, 140, ఐపీ 8, 140 , 38 యూఏపీఏ, 25(1-బి)(ఎ) ఆయుధ చట్టం సెక్షన్లు నమోదు చేయబడ్డాయి.