
ఓరుగల్లు నగర విషయానికొస్తే… తూర్పు సీటు విషయంలో గట్టిగా చర్చ జరుగుతోంది. ఇక్కడ నుంచి ఓ ఎమ్మెల్సీ బరిలో నిలిచే అవకాశం ఉందన్న లీక్ లు బయటికి వస్తున్నాయి. ఇక ఎర్రబెల్లి, వినయ్ భాస్కర్, ఆరూరి రమేశ్ తో పాటు రెడ్యా నాయక్ వంటి నేతలకు టికెట్ల విషయంలో ఇబ్బందులు లేనప్పటికీ… మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భూపాలపల్లి నుంచి మాజీ స్పీకర్ మధుసూదన చారి పోటీ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ గండ్ర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక జనగాం అభ్యర్థి మారుస్తారని… ఇక్కడ నుంచి అదే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ పోటీ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎంపీ కవిత… ఈసారి అసెంబ్లీ బరిలో ఉంటారని… ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో పడ్డారు. ఆమె మహబూబాబాద్ సీటుపై కన్నేశారు. అయితే శంకర్ నాయక్ కు మరోసారి టికెట్ ఇస్తారా లేదా అనేది కూడా చర్చ నడుస్తోంది. ఇక ములుగు సీటు కాంగ్రెస్ ఖాతాలో ఉండగా…ఈసారి ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక్కడ నుంచి ఓ మహిళా ప్రజాప్రతినిధి(జెడ్పీటీసీ)పేరు కనిపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక స్టేషన్ ఘన్ పూర్ లోనూ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లు ఉంది.