
CM Jagan Review : జగనన్నకు చెబుదాం, గడపగడపకూ మన ప్రభుత్వం, ఉపాధి హామీ పనులపై సీఎం జగన్ సమీక్షించారు. స్పందనలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. జగనన్నకు చెబుదాం వినతుల పరిష్కారంలో క్వాలిటీ చాలా ముఖ్యమని సీఎం జగన్ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నట్లు తెలిపారు. ఒకవేళ గ్రీవెన్స్‌ను రిజెక్ట్ చేస్తే సంబంధిత ఫిర్యాదుదారు ఇంటికి ఎందుకు వెళ్లి రిజెక్షన్‌కు గురైందో వారికి వివరించాలన్నారు. పరిశీలించని గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే 24 గంటల్లో వాటిని పరిష్కరించాలి. సెప్టెంబర్ 23 నుంచి జులై 23 వరకూ జగనన్న సురక్షా కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను సీఎం జగన్ స్వాధీనం చేసుకున్నారు. జగనన్నకు చెబుదాం అనుబంధంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఏదైనా పత్రాలకు సంబంధించి, సర్టిఫికెట్లకు సంబంధించి, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై ఆరా తీయాలని సూచించారు. డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలు, అర్హతలకు సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహించాలన్నారు. సమస్యలు ఉన్నవారిని సచివాలయాల వద్దకు తీసుకెళ్లి వారికి కావాల్సిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ కూడా అందించాలని సూచించారు. జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించినవారికి ఆగస్టు 1న నగదు బదిలీ చేస్తామన్నారు.