హైదరాబాద్‌లోని నిమ్స్ కొత్త బ్లాక్:హైదరాబాద్ నిమ్స్ విస్తరణకు అడుగు పడింది. బుధవారం కొత్త బ్లాక్ నిర్మాణం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఎర్రమంజిల్‌లో దశాబ్ది బ్లాక్ పేరుతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన భవనాలకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. వీటిని నిర్మాణాల కారణంగా… నిమ్స్‌లో మరో 2000 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా దేశంలో అత్యధిక సూపర్ స్పెషాలిటీ పడకలు ఉన్న దవాఖానగా నిమ్స్‌లో రికార్డు సృష్టించనుంది. మొత్తం రూ. 1571 కోట్లతో 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త బ్లాక్‌ను నిర్మించనున్నారు.