
ఆత్మకూరు నియోజకవర్గ శివారులలో భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో కంభం జిల్లా జన సంద్రాన్ని తలపించింది. లోకేష్ నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టగానే భారీఎత్తున బాణాసంచా కాల్చుతూ హోరెత్తించారు. ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్రయాదవ్, బొల్లినేని వెంకటరామారావుకు స్వాగతం పలికారు.