
గ్రీన్ ఆర్గనేషన్ ఏంచేస్తుంది ?
గ్రీన్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థను 1994లో లండన్‌లో ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణను ప్రచారం చేయడం, అందుకు కృషి చేస్తున్న వారిని గుర్తించి అవార్డులు ఈ సంస్థ అందిస్తుంది. 2016 నుంచి గ్రీన్ యాపిల్ అవార్డులు అందజేస్తారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థలు, కౌన్సిల్స్, కమ్యూనిటీలకు గ్రీన్ యాపిల్ అవార్డులను అందజేస్తుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నిర్మాణాలకు పలు విషయాలను పరిగణలోకి తీసుకుని ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డులను అందిస్తుంది. నివాసాలు, కోట్లు, మ్యూజియం, బ్రిడ్జిలు, మతపరమైన కట్టడాలు, వారసత్వ కట్టడాలు పలు కేటగిరీల్లో అవార్డులు అందిస్తారు. లండన్‌లోని బాఫ్టా, నేషనల్ మ్యూజియం ఆఫ్ ఖతార్, మలేసియాలోని జలాన్ మహ్‌కోటకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కాయి.