
ఆరుద్ర ఘటనపై కలెక్టర్ కార్యాలయం వివరణ
ఆరుద్ర ఘటనపై కోనసీమ కలెక్టర్ స్పందించారు. ఆరుద్ర జీవనోపాధి కోసం గతంలో కాకినాడ పోర్టులో డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ (నెలకు రూ.22,000 జీతం) కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆమె ఉద్యోగంలో చేరి సెలవు పెట్టారని చెప్పారు. శంఖవరం మండలం గ్రామంలో ఉన్న తన ఇంటిని ఆరోజు అన్న శాఖ సహకారంతో నవంబర్ 22, 2022న అమ్మకం చేసి రూ.31 లక్షలు ఆమెకు డిపాజిట్ చేసినట్లు. ఆరుద్ర ఇంటికి 30 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం కారణంగా కుమార్తె వికలాంగుల పింఛన్‌కు అనర్హులుగా నమోదు అయివున్నందున, కేసును ప్రత్యేకంగా పరిగణించి, నవంబర్ 2022 నుంచి ఆమె కుమార్తెకు నెలకు రూ.3000 అందజేసారు.