
టీఎస్ ఎడ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి
తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. రెండేండ్ల బీడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. వెంకటరమణ, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డిని విడుదల చేశారు. విద్యార్థులను https://edcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని సూచించారు. ఎడ్‌సెట్ పరీక్షను మే 18న మూడు సెషన్లలో జరిగింది. ఈ పరీక్షకు 86 శాతం మంది విద్యార్థులు. రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఎడ్ సెట్ పరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరయ్యారని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. ఎడ్ సెట్ ఫలితాల్లో 26,994 మంది అభ్యర్థులు (98.18 శాతం) ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొన్నారు. ఎడ్‌సెట్‌లో తాండూరుకు చెందిన జి.వినీష ఫస్ట్ ర్యాంకు సాధించగా, హైదరాబాద్‌కు చెందిన నీశా కుమారి రెండో ర్యాంకుతో సాధించారు.