
కండక్టర్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం
టీఎస్ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగుల శాలరీ అకౌంట్లను యాజమాన్యం యూబీఐకి మార్చింది. యూబీఐ సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు తీసుకోవాలంటూ ప్రత్యేక మార్గదర్శకాలు అందించారు. ఆర్టీసీ ఉద్యోగులు యూబీఐ బ్రాంచీల్లో ఓపెన్ చేసి రూపే కార్డులను పొందారు. ఈ అకౌంట్, కార్డు ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉండడంతో ఉద్యోగులకు ఆపద సమయంలో ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని టీఎస్ఆర్టీసీ జారీ. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ కింద కనీసం రూ.40 లక్షలు, రూపే కార్డు కింద మరో రూ.10 లక్షలను యూబీఐ అందిస్తుందని స్పష్టం చేసింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల డిపో కండక్టర్ సత్తయ్య కుటుంబానికి రూ.50 లక్షలు విలువైన చెక్కులను యూబీఐ అధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనర్ మంగళవారం హైదరాబాద్ బస్‌భవాన్‌లో అందజేశారు. పెద్ద కుటుంబాన్ని కోల్పోయి విషాదంలో ఉన్న తమకు సంస్థ అందించిన ఆర్థికసాయం ఎంతో మేలుచేస్తుందని సత్తయ్య కుటుంబ సభ్యులు అన్నారు. రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించడంపై కండక్టర్ సత్తయ్య భార్య పుష్ప, కుమారుడు ప్రవీణ్ కుమార్, కూతురు మాధవీలత సంతోషం వ్యక్తం చేశారు.