
జులై చివరికల్లా వాణిజ్య ఉత్పత్తి
ఈ కొత్త యూనిట్ వాణిజ్య ఉత్పత్తి వచ్చే నెల చివరికల్లా మొదలయ్యేలా చూడాలని ఏపీ జెన్‌కో, బీహెచ్‌ఈఎల్, బీజీఆర్ ప్రతినిధులకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. గ్రిడ్ అనుసంధానం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు నిల్వలను అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన విద్యుత్ ఉత్పత్తిని సాధించాలన్నారు. విద్యుత్ రంగానికి సీఎం వైఎస్ జగన్, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని వివరించారు. ఉత్తమ విధానాలు అవలంభించడానికి, కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని జెన్‌కో ఎండీ ఏపీ కేవీఎన్ చక్రధర్‌బాబు చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో, అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నిర్వహణలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా ఉండేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఏపీ జెన్‌కో డైరెక్టర్లు చంద్రశేఖరరాజు, బి.వెంకటేశులురెడ్డి, సయ్యద్ రఫీ, సత్యనారాయణ, ఆంటోనీ రాజా ఉన్నారు.