
పదే పదే చెప్పిన ప్రయోజనం లేకపోయేసరికి
రాష్ట్ర పరిపాలన కేంద్రమైన ఏపీ సచివాలయంలో మంత్రి ఛాంబర్, పేషీకి ఉద్యోగులు తాళాలు వేశారు. ఈ వ్యవహారం కలకలం రేపింది. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ఛాంబర్లో పనిచేస్తున్న 7గురు సిబ్బందిలో అటెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. వీరికి కాపు కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్లు నుంచి జీతాలు అందిస్తున్నారు. అయితే మంత్రి పేషీలో సిబ్బందికి గత డిసెంబర్ నుంచి జీతాలు రావడం లేదని సిబ్బంది నిరసన తెలిపారు. మంత్రికి, అధికారులకు జీతాల చెల్లింపుపై పదే పదే చెప్పకుండా పట్టించుకోకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్న సిబ్బంది తెలిపారు. జీతాల విషయంలో అనేక మార్లు మంత్రిని, ఓఎస్డీని అడిగినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అయితే ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. తాళం వేసి నిరసన తెలిపిన సిబ్బందికి జీతాలు చెల్లిస్తుందా? లేక చర్యలు తీసుకుంటుందా? అనే చర్చ ఉద్యోగుల్లో మొదలైంది.