
పట్టణంలోని ప్రధాన నాయకులన్నీ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయాయి. సమీకృత కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంతో పాటు , బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ క్రాంతి, ఎస్పీ సృజనతో కలిసి పరిశీలించారు. జోగులాంబ గద్వాల జిల్లాకు గతంలో ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు, పనులతో పాటు ముఖ్యమంత్రి ప్రజలకు తాజా రాజకీయ పరిణామాలపై సభలో మాట్లాడే అవకాశం వచ్చింది.