[ad_1]
Central Funds To AP TS Govts : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పన్నులు, సుంకాల వాటాల నిధులు విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ఏపీ, తెలంగాణకు రాష్ట్ర వాటా కింద నిధులు విడుదల చేసింది. జూన్ నెలకు గానూ మూడో విడత కింద రాష్ట్రాలకు మొత్తం రూ.1,18,280 కోట్ల నిధులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. నెలలో చెల్లించాల్సిన నిధులతో పాటు ఒక విడత అడ్వాన్స్‌ని విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో జూన్‌లో అందించింది. ఈ నిధులను మూలధన వ్యయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అదేవిధంగా ప్రధాన ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధులు అందించే ఉద్దేశంతో ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల వాటా కింద రూ.4,787 కోట్లు, తెలంగాణ వాటా కింద రూ.2,486 కోట్లు విడుదల చేసింది. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం వాటాను తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తుంది. రాష్ట్ర వాటాలను ఒక ఆర్థిక సంవత్సరంలో 14 విడతల్లో కేంద్రం విడుదల చేస్తుంది. ఇటీవల ఏపీకి కేంద్రం భారీగా నిధులు విడుదల చేసింది. లోటు బడ్జెట్ కింద 10,400 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం రూ.12 కోట్లు విడుదల చేసింది.
[ad_2]