
స్కూల్ విద్యార్థులకు బహుమతి: ఏపీలో బడి పిల్లలకు ఇవ్వాల్సిన కానుకల గంటను మోగిస్తున్నట్లు సిఎం జగన్ పల్నాడులో ప్రకటించారు. ప్రభుత్వ, ఐడెడ్ స్కూల్ విద్యార్దులకు ఉచితంగా విద్యా కానుక కిట్లను ఇస్తున్నట్లు చెప్పారు. కిట్‌లో ప్రతి విద్యార్ధికి కుట్టుకూలీతో కలిపి మూడు జతల యూనిఫాం, స్కూల్ బ్యాగ్, రెండు భాషల్లో ముద్రించిన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్, రెండు జతల సాక్స్, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ విద్యా కానుక కిట్‌లో ఉంటోంది.